Lover Cut Boyfriend Private Parts : బిహార్‌లో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని కోసింది ఓ ప్రియురాలు. తన బాయ్‌ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకోబోతున్నాడని మనస్తాపానికి గురైన నిందితురాలు.. బాధితుడిపై ఇలా దాడికి పాల్పడింది. ఈ ఘటన పట్నాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితుడు పట్నాలోని శివహార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన చుట్టాల అమ్మాయి అయిన నిందితురాలు పట్నాలో చదువుకుంటోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు.
ఇటీవలే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తన ప్రేమికుడికి జూన్ 23న మళ్లీ పెళ్లి జరగబోతుందన్న విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి పట్నాకు రమ్మని చెప్పింది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.
పట్నా వచ్చిన బాధితుడు ఓ హోటల్లో ప్రియురాలిని కలిశాడు. అతడు వేరే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని బాయ్‌ఫ్రెండ్‌కు ప్రియురాలు చెప్పింది. ఆ తర్వాత అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అనంతరం ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బ్యాగ్‌లోంచి పదునైన ఆయుధం తీసి.. ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. బాధితుడి ప్రైవేటు పార్ట్ 60 శాతం తెగడం వల్ల.. గట్టిగా ఆర్తనాదాలు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు పరిస్థితి విషమంగా ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గాంధీ మైదాన్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందతున్నాడని పట్నా నగర ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు.
యువతిపై స్నేహితుల గ్యాంగ్ రేప్..
ఓ కళాశాల విద్యార్థిపై తన ఇద్దరు స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బంగాల్లోని డార్జిలింగ్‌లో జరిగింది. బాధితురాలు, తన స్నేహితులు మతిగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సిముల్తాలా టీ ఎస్టేట్ నివాసితులు. బాధితురాలికి నిందితులతో చాలా కాలంగా పరిచయం ఉంది. బుధవారం యువతి కళాశాల నుంచి ఇంటికి తిరిగివస్తున్న సమయంలో.. నిందితులు ఆమెను కలిశారు. రెస్టారెంట్లో భోజనం చేద్దామని యువతిని ఒప్పించి దగ్గర్లోని సిముల్తాలా టీ తోటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు నీలోయ్ సర్కార్, ఆకాష్ మోండల్‌ను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సిలిగుడి పోలీస్ కమిషనర్ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. నిందితులను సిలిగుడి సబ్ డివిజనల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగించింది. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఉత్తర బంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరం.. వివాహేతర సంబంధమే కారణం
తమిళనాడు తెన్కాసి జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో మెయింటెనెన్స్ పనులు జరుగుతుండగా.. సెప్టిక్ ట్యాంక్‌లో గత ఆదివారం అస్థిపంజరం బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజులు క్రితం మధు అనే కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. అంతకుముందు అతడి ఎదురింట్లో ఉన్న పెళ్లైన మహిళతో మధుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఏకాంత సమయంలో తీసిన వీడియో చూపించి వివాహితను బ్లాక్మెయిల్ చేశాడు మధు. దీంతో ఓ రోజు మధును ఆహ్వానించి ఏకాంత సమయంలో అతడి కాళ్లు, చేతులు కట్టేసింది. దీనికి మధు ఒప్పుకున్నాడు. అనతరం మధును దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం తన తల్లి, సోదరుడు సహాయంతో సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పడేసింది.
కాలేజీ విద్యార్థి మధును చంపిన నిందితులు