మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. మహ్మద్ షాకీర్ అనే వ్యక్తి.. పంజాబీ వితంతువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను మతమార్పిడి చేసుకోమని బలవంతం చేశాడు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై విజయనగర్ పోలీసులను ఇందోర్ హైకోర్టు మందలించింది. బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆమెకు నిందితుడు మహ్మద్ షాకీర్ బ్యాంకు రుణం ఇప్పిస్తానని పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో చనువు పెంచుకుని స్నేహితుడిగా మారాడు. కొద్ది రోజుల క్రితం మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు ఆ దారుణాన్ని వీడియో తీసి.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల తర్వాత నిందితుడు ఓ వర్గానికి చెందిన వ్యక్తి అని.. అతడికి 9 మంది పిల్లలు ఉన్నారని బాధితురాలికి తెలిసింది.
మంత్రగత్తె అని..
బిహార్ గయాలోని దారుణం జరిగింది. మాంత్రికురాలు అనే అనుమానంతో ఓ మహిళపై దాడి చేసి అనంతరం సజీవ దహనం చేశారు గ్రామస్థులు. ఆమె ఇంటిని సైతం తగులబెట్టారు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇమామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన పరమేశ్వర్ భారతి అనే యువకుడు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. హేమంతి దేవి అనే క్షుద్రపూజలు చేయడమే అతని మృతికి కారణమని భావించి బాధితురాలిని సజీవ దహనం చేశారు గ్రామస్థులు. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.