తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బులు లేకున్నా లాటరీ టికెట్- రూ.6కోట్ల జాక్​పాట్​ - లక్కీడ్రా

లాటరీ టికెట్టు విక్రయదారుల నిజాయతీ.. ఓ వ్యక్తిని కోటీశ్వరుడ్ని చేసింది. టికెట్టు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పగా.. ఫోన్​లోనే నంబర్​ పంపారు. అదే నంబర్​కు లాటరీ తగిలింది. వారు అతనికి లాటరీ డబ్బులు వచ్చేలా చేసి నిజాయతీని చాటుకున్నారు.

Lottery seller's
స్మిజా కే మోహన్​, రాజేశ్వరన్స్మిజా కే మోహన్​, రాజేశ్వరన్​ దంపతులు

By

Published : Mar 26, 2021, 7:41 PM IST

లాటరీ తగిలిన టికెట్టు ఎవరి వద్ద ఉంటే వారికే డబ్బులు ఇస్తారు. కానీ, ఫోన్​ ద్వారానే లాటరీ టికెట్టు కొనుగోలు చేసిన వ్యక్తికే డబ్బులు ఇచ్చి తమ నిజాయతీని చాటుకున్నారు కేరళలోని ఎర్నాకుళంకు చెందిన దంపతులు.

ఇదీ జరిగింది..

ఎర్నాకుళంలోని వలంబుర్​కక్కనాడ్కు చెందిన దంపతులు స్మిజా కే మోహన్​, రాజేశ్వరన్​లు లాటరీ టికెట్లు విక్రయిస్తుంటారు. రోజూలాగానే గత ఆదివారం రాజగిరి ఆసుపత్రికి సమీపంలో లాటరీ టికెట్లను అమ్ముతున్నారు. 12 టికెట్లు మినహా అన్నీ అమ్ముడుపోయాయి. వీటిని కూడా అమ్మి ఇంటికి వెళదామంటే ఎవరూ కొనడం లేదు. తరచుగా తన దగ్గర టికెట్లు కొనే వారికి సమాచారం అందించి తీసుకోవాలని చెప్పారు స్మిజా. వారిలో పాలచోటిల్​కు చెందిన పీకే చంద్రన్​ ఉన్నారు. అతనికి ఫోన్​ చేసి టికెట్టు కొనమన్నారు. అయితే టికెట్టు కొనడానికి కావల్సిన రూ.200 తన దగ్గర ఇప్పుడు లేవని మరునాడు ఇస్తానని అన్నాడు. సరే అని ఫోన్​లోనే టికెట్టు నెంబర్​ చెప్పారు స్మిజా.

స్మిజా కే మోహన్​, రాజేశ్వరన్
లాటరీ టికెట్లు అమ్ముతున్న
లాటరీ టికెట్ల అమ్మకం

మరుసటి రోజు లక్కీడ్రా తీయగా అతనికి చెప్పిన టికెట్టు నెంబర్​కే రూ.6కోట్లు జాక్​పాట్​ తగిలింది. ఆ వెంటనే చంద్రన్​ ఇంటికి వెళ్లి.. లాటరీలో రూ.6కోట్లు గెలుచుకున్నాడని స్మిజా దంపతులు చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి టికెట్టు రుసుం రూ.200 తీసుకున్నారు.

ఇదీ చదవండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్

ABOUT THE AUTHOR

...view details