అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించే విధానాన్ని త్వరలోనే రూపొందించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. దీనితో విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటాయని.. ఫలితంగా ఈ రంగంలో అపార అవకాశాలు సొంతమవుతాయని అభిప్రాయపడ్డారు. పలు విదేశీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు.
"అంతరిక్ష రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ అనంతరం విదేశీ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. దీనితో భారతీయ, విదేశీ కంపెనీల మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది. ఫలితంగా ఇరు దేశాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది."