Balijaguda Accident Today : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బలిజగూడ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన సహేజా బేగం గత కొంతకాలంగా బలిజగూడ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుంది. పది రోజుల క్రితం తన రెండో కుమార్తె కుమారుడు ఎండీ సమీర్(9), కూతురు ఫాతిమా(5) ఇక్కడికి వచ్చారు. ఆదివారం రాత్రి పిల్లలను ఇద్దరిని తీసుకొని పెద్ద అంబర్‌పేట్‌లోని బేకరీకి వెళ్లింది.
Balijaguda Accident Today : లారీ, కారు ఢీకొని.. ముగ్గురు మృతి - బలిజగూడ ప్రమాదంలో ముగ్గురు మృతి
11:39 May 08
Road Accident: లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి
తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తుండగా ఏఎల్‌నగర్ కమాన్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
Hyderabad Girl Killed in US Shootout : అమెరికా కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి
Young Woman Suicide in Rangareddy : ఆమెను నేను ప్రేమించా.. నువ్వెలా పెళ్లి చేసుకుంటావు..?