దేశ వ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర(jagannath rath yatra) ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే స్వామివారి రథయాత్ర జరుగుతోంది.
పూరీలోని శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు.. నిరాడంబరంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరారు.
భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభమైందని, రెండు రోజుల పాటు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో భద్రతా బలగాలు మోహరించినట్లు స్పష్టం చేశారు. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గుజరాత్..
గుజరాత్‌లోనూ నిరాడంబరంగా జగన్నాథుని రథయాత్ర జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరూపాని పూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. నిర్వహకులు సహా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.