తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎల్జేపీ ఖాళీ- ఉన్న ఒక్క ఎమ్మెల్యే జేడీయూలో చేరిక

ఎల్జేపీ తరుపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజ్​ కుమార్​ సింగ్​ జేడీయూ గూటికి చేరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీష్​ కుమార్ సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకున్నారు.

Rajkumar Singh joins JD(U)
రాజ్​ కుమార్​ సింగ్​

By

Published : Apr 7, 2021, 7:11 PM IST

పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న ఎల్జేపీ నాయకుడు చిరాగ్​ పాసవాన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజ్​కుమార్​ సింగ్​ జేడీయూలో చేరారు. ముఖ్యమంత్రి నితీష్​ కుమార్​ సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఎల్జేపీ పార్టీని జేడీయూలో కలిపేయడానికి బిహార్​ స్పీకర్​ మంగళవారం అనుమితినిచ్చారు. దీంతో అసెంబ్లీలో ఎల్​జేపీ గళం వినిపించే అవకాశమే లేకుండా పోయింది.

డిప్యూటీ స్పీకర్​ ఎన్నిక కోసం ఎన్​డీఏ కూటమికి మద్దతుగా రాజ్​ కుమార్​ ఓటేయగా.. ఎల్జేపీ జనరల్​ సక్రటరీ గత నెలలోనే షో కాజ్​ నోటీసులు జారీ చేశారు. భాజపా నాయకుడు భూపేంద్ర యాదవ్​ను గత ఫిబ్రవరిలో కలిసినప్పుడే రాజ్​ కుమార్.. జేడీయూలో చేరుతున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అవి నిజమయ్యాయి.

ఎల్జేపీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్సీ నుతన్​ సింగ్​(భాజపా నాయకుడు నీరజ్​ కుమార్ భార్య) గత ఫిబ్రవరిలోనే కాషాయ కండువా కప్పుకున్నారు.

ఎన్​డీఏతో సీట్ల సర్దుబాటులో పొత్తు కుదురకపోవటంతో గత ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగానే పోటీ చేసింది. 143 స్థానాల్లో బరిలో దిగగా.. మిటిహని నియోజకవర్గం నుంచి మాత్రమే స్వల్ప ఆధిక్యం(333ఓట్లు)తో రాజ్​ కుమార్​ సింగ్​ విజయం సాధించారు. అవినీతి ఆరోపణలతో నితీష్​ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న చిరాగ్​కు​.. సొంత పార్టీ నేతలు జేడీయూలో చేరడం ఇబ్బందికరంగా మారిందని సమాచారం.

ఇదీ చదవండి:'షా ఆదేశాలతోనే.. ఓటర్లపై జవాన్ల వేధింపులు'

ABOUT THE AUTHOR

...view details