తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 4:13 PM IST

Updated : Sep 14, 2023, 5:09 PM IST

ETV Bharat / bharat

Lokesh Fires On Jagan: జగన్​ ప్రతి తప్పునూ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. స్మగ్లర్లున్న జైలులో చంద్రబాబుకు భద్రత ఎలా..? : లోకేశ్

Lokesh Fires On Jagan : నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజల తరఫున పోరాడే నాయకులపై కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేనతో పొత్తుపై ఇరుపార్టీల నేతల కమిటీ పని చేస్తుందన్నారు.

Lokesh_Fire_On_Jagan
Lokesh_Fire_On_Jagan

Lokesh Fires On Jagan : జగన్‌ ప్రతి తప్పునూ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు భద్రతపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారని చెప్తూ.. చంద్రబాబుకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

Lokesh Fires on CM Jagan on Skill Case: 'రాజకీయ ప్రతీకారంగానే చంద్రబాబు అరెస్ట్​.. జగన్​లా జైలుకు వెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు'

రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ప్రజల తరఫున పోరాడితే అడుగడుగునా అవమానించారని అన్నారు. నా తల్లిని అవమానించారు, నన్ను దూషించారు.. బ్రాహ్మణిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu) ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదని, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశాం అని తెలిపారు. జనసేనతో కలిసి పోరాటంపై కమిటీ ఏర్పాటు చేస్తామన్న లోకేశ్.. చర్చల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 'పవన్‌ ప్యాకేజీ తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్యాకేజీ తీసుకున్నట్లు ఒక్క ఆధారం చూపాలి.. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది..' అని లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

Chandrababu Family Members at Rajamahendravaram Central Jail: చంద్రబాబుకు అండగా కుటుంబ సభ్యులు.. కారాగార సమీపంలోనే బస..

జగన్ పాలనలో సామాన్యులకు రక్షణ కొరవడిందని లోకేశ్ (Lokesh) పేర్కొన్నారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, వైసీపీ నాయకులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న టీడీపీ, జనసేన (Janasena) నాయకులపై కేసులు పెడుతున్నారని, రాష్ట్ర సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని, ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. 'భీమవరంలో యువగళం పాదయాత్ర శాంతియుతంగా చేశాం.. సైకో పోవాలి-సైకిల్‌ రావాలి పాటకు వైసీపీ శ్రేణులే డ్యాన్స్‌ చేశాయి అని చెప్పిన లోకేశ్.. యువగళం (Yuvagalam) పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మాపైనే కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

Jada Shravan meets Nara Lokesh: 'ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి జగన్‌కు భయం పట్టుకుంది... అందుకే కుయుక్తులు'

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు.. సైబర్‌ టవర్స్‌ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు.. అలాంటి వ్యక్తిపై ఆధారాలు లేకుండా.. స్కామ్‌ జరిగిందని కేసు పెట్టారని లోకేశ్ ఆగ్రహించారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్‌ వార్‌ (Civil War) మొదలుపెట్టాలని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనసేన,టీడీపీ తరఫున కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు లోకేశ్వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాడుతామని చెప్పారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా అధికార పక్షానికి చెమటలు పట్టిస్తున్నారు.. బయట ఉన్నా.. లోపల ఉన్నా సింహాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. మీడియా గొంతు నొక్కేందుకు జీవో తీసుకువచ్చారు.. అమరావతి (Amaravati) రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.. జగన్‌ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు వచ్చిన అధికారుల కాల్‌డేటా (Call Data) రికార్డులు భద్రపరచాలని కోరాం అని వెల్లడించారు.

Rajinikanth Phone Call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు: రజనీకాంత్​

Last Updated : Sep 14, 2023, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details