తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ.. ఉభయసభలు సోమవారానికి వాయిదా

పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ.. ఉభయసభలు వాయిదా
పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ.. ఉభయసభలు వాయిదా

By

Published : Feb 3, 2023, 11:17 AM IST

Updated : Feb 3, 2023, 3:13 PM IST

14:47 February 03

రాజ్యసభ సోమవారానికి వాయిదా

అదానీ అంశంపై చర్చించాలని.. జాయింట్​ పార్లమెంట్​ కమిటీ చేత దర్యాప్తు చేయించాలంటూ విపక్షాలు ఉభయ సభల్లోనూ ఆందోళనలకు దిగాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఇరు సభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చించాలంటూ ఆందోళనలకు దిగాయి ప్రతిపక్షాలు. సభ సజావుగా జరిగేలా చూడాలని రాజ్యసభ ఛైర్మన్​ జగదీప్​ ధన్​ఖడ్​, లోక్​ సభ స్పీకర్​ ఓం బిర్లా చేసిన విజ్ఞప్తులను సభ్యులు పట్టించుకోకుండా ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం చెలరేగడం వల్ల ఇరు సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనా పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు.

14:20 February 03

లోక్​సభ మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా సభ సోమవారానికి వాయిదా పడింది.

11:10 February 03

పార్లమెంట్​లో అదానీ- హిండెన్​బర్గ్​ నివేదిక రగడ.. ఉభయసభలు వాయిదా

భారీగా కుప్పకూలుతున్న అదానీ గ్రూప్‌ షేర్ల ఎఫెక్ట్‌ రెండోరోజు పార్లమెంట్‌పై పడింది. దాంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దాంతో వాయిదాల పర్వం కొనసాగింది.

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలన్నాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు. సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. కాగా, ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం అయ్యాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించాయి.

Last Updated : Feb 3, 2023, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details