Driver Stopped Train To Consume Liquor: బిహార్‌లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్న విక్రయాలు ఆగడం లేదు. తాజాగా సమస్తిపుర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం సేవించడానికి రైలునే ఆపేశాడు ఓ డ్రైవర్. సమస్తీపుర్ నుంచి సహర్సాకు ప్రయాణించే ప్యాసింజర్ రైలును నడుపుతున్న అసిస్టెంట్ లోకో పైలట్ కర్మవీర్ ప్రసాద్... హసన్‌పుర్ స్టేషన్లో రైలును ఆపి మద్యం తాగడానికి వెళ్లాడు.
మద్యం కోసం రైలును ఆపేసిన డ్రైవర్.. మార్కెట్లో హంగామా!
Driver Stopped Train To Consume Liquor: చాయ్ కోసం రైలును ఆపిన ఘటన మరవకముందే.. మరో ఘటన జరిగింది. మద్యం తాగడానికి రైలునే నిలిపివేశాడు మరో డ్రైవర్. ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని సమస్తిపుర్ జరిగింది.
అసిస్టెంట్ లోకో పైలెట్ లేకపోవడం వల్ల రైలు ముందుకు కదలలేదు. దీంతో రైలులోని ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలు సేవలను పునరుద్ధరించారు. రైలు అసిస్టెంట్ లోకో పైలట్ కర్మవీర్ ప్రసాద్ హసన్‌పుర్ మార్కెట్లో మద్యం సేవించి హంగామా సృష్టినట్లు తెలిసింది. వెంటనే జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం హసన్‌పుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండి:ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్.. వెల్లివిరిసిన మత సామరస్యం