కరోనా కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్ విధించిన రాష్ట్రాల జాబితాలో బంగాల్ చేరింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విధించిన ఆంక్షలు సానుకూల ఫలితాలనిస్తున్న తరుణంలో.. వాటినే కొనసాగించాలని యోచిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఆంక్షలను పొడిగించారు.
లాక్‌డౌన్ ఎక్కడెక్కడ?
- బంగాల్లో మే 16 నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.
- దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు.
- తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్‌లో మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధించారు.
- హరియాణాలో ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
- కేరళలో మే 23 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. మిజోరంలో ఐజ్వాల్ సహా ఇతర జిల్లాల్లో విధించిన లాక్‌డౌన్ మే 24 వరకు కొనసాగనుంది.
- ఒడిశాలో మే 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
- కర్ణాటకలో మే 24 వరకు లాక్‌డౌన్ విధించారు.
- తెలంగాణలో మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు.
- నాగాలాండ్‌లో మే 14 నుంచి మే 21వరకు వారం పాటు పూర్తి లాక్‌డౌన్ విధించారు.
- బిహార్‌లో మే 15న లాక్‌డౌన్ ముగియాల్సి ఉండగా.. మే 25 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
- సిక్కింలో మే 17 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధించారు.
ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు