కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్లీలో లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. వైరస్ వ్యాప్తి అదుపులో లేనందున మరో వారం పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరియాణాలోనూ లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లోనూ..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోనూ లాక్‌డౌన్‌ను మే 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న ప్రారంభమైన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నందున మరో వారం పాటు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే 18 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లు మూతపడ్డాయి. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చదవండి:120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్డౌన్