తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురి పెళ్లికి తండ్రే పురోహితుడు

సాధారణంగా పురోహితుల సొంతింట్లో వివాహాది శభకార్యాలంటే ఇతర బ్రాహ్మణులు నిర్వహించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన పెళ్లికి మాత్రం వధువు తండ్రే పురోహితుడిగా మారారు. అన్నీ తానై కూతురు, బంధువుల కుమార్తె పెళ్లిళ్లు జరిపించారు.

Father become priest for his daughter's wedding
పెళ్లి, పురోహితుడు

By

Published : May 24, 2021, 1:48 PM IST

కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకలో అరుదైన ఘటన జరిగింది. కుమార్తె పెళ్లికి తండ్రే పురోహితుడయ్యారు.

కూతురు, బంధువుల పెళ్లికి పౌరోహిత్యం చేస్తున్న మల్లయ్య స్వామి
కూతురు, బంధువుల పెళ్లికి పౌరోహిత్యం చేస్తున్న మల్లయ్య స్వామి

రాయచూర్​ జిల్లా సింధనూరు తాలుకాలోని పోథ్​నాల్​ గ్రామంలో మల్లయ్య స్వామి.. తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కర్ణాటకలో లాక్​డౌన్ విధించిన కారణంగా పెళ్లికి బయటి పురోహితులెవ్వరూ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో వధువు తండ్రే పురోహితుడిగా వ్యవహరించారు. ఆచార, సంప్రదాయాలతో స్వయంగా తానే దగ్గరుండి ఆయన కూతురితో పాటు బంధువుల కూమార్తె వివాహాన్నీ జరిపించారు మల్లయ్య స్వామి.

ఇదీ చదవండి:30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి

ABOUT THE AUTHOR

...view details