బిహార్లోని మొతిహరి జిల్లాలోని ఓ గ్రాామానికి చెందిన ప్రజలు రెచ్చిపోయారు. పోలీసులు కాలితో తన్నగా తమ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహానికి లోనైన వారు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కోతావా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయకటోలా గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. కొంత మంది పోలీసులు గాయపడ్డారు.
మరణించిన వృద్ధురాలిని సుశీలా దేవిగా అధికారులు గుర్తించారు. పోలీసులపై ఆమె చిన్న కుమారుడు చోటేలాల్ యాదవ్ ఫిర్యాదు చేశాడు. తమ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వం చేశారన్న ఆరోపణలతో.. ఎస్హెచ్ఓ నితిన్ కుమార్ నేతృత్వంలోని బృందం సోదాలు నిర్వహించిందని విలేకరుల సమావేశంలో తెలిపాడు.
"పోలీసులు వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇంట్లోనే ఉన్నాం. వారిని ఇంట్లోకి వెళ్లవద్దని మా అమ్మ చెప్పింది. అప్పుడు.. ఓ పోలీసు ఆమెను కాలితో తన్నాడు. దాంతో.. కిందపడిన మా అమ్మ అక్కడికక్కడే మరణించింది."