ట్రాలీపై డౌట్.. చెక్ చేస్తే 47 కొండచిలువలు.. ఎయిర్పోర్ట్ అధికారులు షాక్! Lizards And Pythons Seized In Trichy Airport : ట్రాలీ బ్యాగ్‌లో కొండచిలువలు, బల్లులను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అనుమానం వచ్చిన తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అధికారులు.. అతడిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. నిందితుడి బ్యాగ్‌లోని బాక్సుల్లో ఉన్న 47 కొండచిలువలు, 2 బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
మహమ్మద్ మొయిద్దీన్ అనే ప్రయాణికుడు మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి బాటిల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఆదివారం తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడి ట్రాలీ బ్యాగ్‌లో ఏదోఅక్రమ రవాణా జరుగుతుందని కస్టమ్స్ అధికారులు అనుమానించారు. వెంటనే మెయిద్దీన్ బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో 47 కొండచిలువలు, 2 బల్లులను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు మహమ్మద్ మెయిద్దీన్ను అరెస్ట్ చేసి.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అటవీ అధికారులు.. సురక్షితంగా సరీసృపాలను కాపాడారు. వాటిని తిరిగి మళ్లీ మలేసియా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుడు మెయిద్దీన్కు వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేశారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న కొండచిలువలు ఇటీవలే మలేసియా నుంచి అక్రమంగా తరలిస్తున్న 6,850 తాబేళ్లను తిరుచ్చి విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. నెలల వ్యవధిలోనే కొండచిలువలు, బల్లులు అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం.
కొండచిలువలు, బల్లులను స్వాధీనం చేసుకున్న అధికారులు అరుదైన పాములను తరలిస్తూ మహిళ అరెస్ట్..
కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్ జంషెద్పుర్లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ అరుదైన పాములను తరలిస్తూ ఆర్పీఎఫ్ పోలీసులకు పట్టుబడింది. ఆ మహిళ నుంచి అనేక విదేశీ జాతుల పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని అటవీ శాఖకు అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఓ మహిళ విదేశీ పాములను అక్రమంగా తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు టాటానగర్‌లో తనిఖీలు చేపట్టారు. ప్లాట్‌ఫామ్ నంబర్ 3 పై దిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఆ మహిళను బ్యాగ్‌తో సహా గుర్తించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.