తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మజ్జిగలో బల్లి.. వధూవరులతో సహా 16 మందికి అస్వస్థత.. - మజ్జిగలో బల్లి వార్త

Lizard In Buttermilk: ఓ వివాహ వేడుకలో బల్లి పడిన మజ్జిగ తాగి.. వధూవరులతో సహా 16 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Lizard In Buttermilk
Lizard In Buttermilk

By

Published : May 23, 2022, 10:17 PM IST

Updated : May 23, 2022, 10:38 PM IST

Lizard In Buttermilk: రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలోని ఓ వివాహ కార్యక్రమంలో బల్లి పడిన మజ్జిగ తాగి 16 మంది అనారోగ్యం బారినపడ్డారు. అందులో వధూవరులు కూడా ఉన్నారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. సిక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది.. సిక్రీలోని ఓ గ్రామానికి చెందిన దిన్ మహ్మద్ కుమారుడు నిజాముద్దీన్‌కు మే 19న వివాహం జరిగింది. వివాహ అనంతరం జరిగిన ఓ కార్యక్రమానికి అతిథులు హజరయ్యారు. వారందరికీ మజ్జిగ అందించారు. ఆ సమయంలో వధూవరులు కూడా తాగారు. కాసేపటికే మజ్జిగ తాగిన వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. వాంతులు చేసుకుని నీరసపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిని వెంటనే సిక్రీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారిని ఆళ్వార్‌ ఆసుపత్రిలో చేర్చారు. చివరగా, కుటుంబ సభ్యులు మజ్జిగ కుండను ఖాళీ చేయగా, అందులో బల్లి ముక్కలై కనిపించింది.

Last Updated : May 23, 2022, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details