తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2021, 2:06 PM IST

ETV Bharat / bharat

కుప్పకూలిన మూడంతస్తుల భవనం- లక్కీగా అప్పుడే...

భారీ వర్షాలకు బెంగళూరులో మరో భవనం (Bangalore Building collapse) కుప్పకూలింది. ఇప్పటికే ఓ పక్కకు ఒరిగిపోయిన మూడంతస్తుల భవనం.. ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించిన వెంటనే కూలిపోయింది.

bengaluru building collapse
బెంగళూరు భవనం కుప్పకూలింది

బెంగళూరులో భవనం కూలిపోయిన దృశ్యాలు

బెంగళూరులో వరుసగా భవనాలు కుప్పకూలడం (Bangalore Building collapse) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలోని రెండు చోట్ల ఇలాంటి ఘటనలు జరగ్గా.. తాజాగా కమలా నగర్​లో​ మూడంతస్తుల భవనం కూలిపోయింది. (Bangalore Building collapse news)

కుండపోత వర్షాల కారణంగా భవనం ఇప్పటికే దెబ్బతింది. పునాది చుట్టుపక్కల మట్టి తొలగిపోవడం వల్ల.. మంగళవారం రాత్రి భవనం ఓ పక్కకు ఒరిగిపోయింది. దీంతో భవానాన్ని ధ్వంసం చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక రంగంలోకి దిగింది. పక్కనే ఉన్న మరో భవనం యజమానులకూ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి శిథిలాలను తొలగిస్తుండగా.. భవనం ఒక్కసారిగా కూలిపోయింది. (Bangalore Building collapse today)

అధికారుల నోటీసుల కారణంగా భవనాల్లో నివాసం ఉండే వారంతా ముందుగానే ఖాళీ చేశారు. కూలిపోయిన భవనంతో పాటు చుట్టుపక్కల ఇళ్లలో ఉంటున్న వారిని వేరే ప్రాంతానికి తరలించినట్లు బెంగళూరు మహానగర పాలిక వెల్లడించింది. (Bangalore building collapse video)

మరోవైపు, నాగరథ్​పేట్​ ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ భవనం గోడ కూలిపోయింది. (Bengaluru Building crash) ఈ ఘటనలోనూ ఎవరికీ గాయాలు కాలేదని బీబీఎంపీ అధికారులు తెలిపారు. ఆరేళ్లుగా భవనంలో ఎవరూ నివసించడం లేదని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే...

వారం రోజుల క్రితం కస్తూరినగర్​లో ఓ భవనం, బెంగళూరు మిల్క్ యూనియన్​ ఆవరణలో మరో భవనం కుప్పకూలింది. ఈ రెండు ఘటనల్లోనూ కొద్దిగంటల ముందుగానే నివాసితులను ఖాళీ చేయించడం వల్ల ఘోర ప్రమాదం తప్పినట్లైంది.

ఇదీ చదవండి:Live Video: కుప్పకూలిన భవనం.. లక్కీగా కాసేపటి ముందే...

ABOUT THE AUTHOR

...view details