సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ వివరాలు..
- బంగాల్- 77.66 శాతం
- కేరళ- 69.41 శాతం
- తమిళనాడు- 60.78 శాతం
- పుదుచ్చేరి- 76.57 శాతం
- అసోం- 78.94 శాతం
17:37 April 06
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ వివరాలు..
15:24 April 06
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు
13:46 April 06
జోరుగా పోలింగ్..
బంగాల్ మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటింగ్ భారీగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసేందుకు తరలివస్తున్నారు.
13:43 April 06
ఓటేసిన మమ్మూట్టీ
ప్రముఖ మలయాళ నటుడు మమ్మూట్టీ ఓటేశారు. ఎర్నాకుళంలోని పొన్నురున్ని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
12:26 April 06
ఓటేసిన వైకో..
ఎండీఎంకే అధినేత వైకో.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలింగపట్టీలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు వైకో
12:03 April 06
టీఎంసీ, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ
బంగాల్లోని ఆరంబాగ్‌లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మమతా బెనర్జీకి ఓటు వేయద్దంటూ.. భాజపా కార్యకర్తలు మహిళలు బెదిరిస్తున్నారని తృణమూల్ అభ్యర్థి సుజాత మోండల్ ఆరోపించారు.
11:37 April 06
ఐదు రాష్ట్రాల పోలింగ్ శాతం
బంగాల్లో ఉదయం 11 గంటల వరకు 34.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. కేరళలో 29.03, తమిళనాడులో 29.29, పుదుచ్చేరిలో 20.07, అసోంలో 33.18 శాతం పోలింగ్ నమోదైంది.
11:19 April 06
ఓటేసిన భాజపా నేత హిమంతా బిశ్వ శర్మ
అసోం మంత్రి, భాజపా నాయకుడు హిమంతా బిశ్వ శర్మ ఓటేశారు. గువాహటిలోని అమీన్‌గావ్ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
10:47 April 06
ఓటేసిన పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఓటేశారు. ఎడప్పాడిలోని సిలువంపాయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
10:36 April 06
డీఎంకేపై ఈసీకు ఖుష్బూ ఫిర్యాదు
ఓటర్లకు డీఎంకే కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా అభ్యర్థి ఖుష్బూ సుందర్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
10:26 April 06
ఓటేసేందుకు సైకిల్‌పై వచ్చిన విజయ్
తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఓటేసేందుకు సైకిల్‌పై వచ్చాడు. చెన్నై నీలంకరైలోని వేల్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విజయ్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:16 April 06
ఓటేసిన గవర్నర్ తమిళసై
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఓటేశారు. చెన్నై విరుంబాక్కంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
10:01 April 06
ప్రముఖ తమిళనటుడు విజయ్.. తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెన్నై నీలంకరాయ్లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
09:59 April 06
పోటెత్తిన ఓటర్లు..
బంగాల్, అసోంలో ఉదయం 9.30 గంటల వరకు 14 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 17 శాతానికిపైగా ఓటింగ్ జరిగింది.
09:44 April 06
కరుణానిధి స్మారకం వద్ద స్టాలిన్ నివాళి
డీఎంకే అధినేత స్టాలిన్. తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు కుటుంబసమేతంగా మాజీ సీఎం. కరుణానిధి స్మారకం దగ్గర స్టాలిన్ నివాళి అర్పించారు.
09:35 April 06
ఓటేసిన పన్నీర్‌సెల్వం..
తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరియకుళమ్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించనున్నారని పన్నీర్ సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే మూడోసారి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు.
09:27 April 06
బంగాల్లోని దగిరా బదుల్దంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేయకుండా తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని.. భాజపా నేత దీపక్ హల్దార్ తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లానన్నారు.
09:24 April 06
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు వీ. నారాయణస్వామి ఓటేశారు.
08:16 April 06
స్టాలిన్ ఓటు..
డీఎంకే అధినేత స్టాలిన్.. తమిళనాడు తేయ్నంపేట్లో ఓటేశారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కుటుంబతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
08:09 April 06
ఎల్డీఎఫ్ మద్దతుదారుడు ఇలా..
కేరళలో మరోమారు అధికారాన్ని దక్కించుకునేందుకు ఎల్డీఎఫ్ చూస్తోంది. తాజాగా.. ఓ మద్దతుదారుడు.. ఇలా ఎల్డీఎఫ్పై ప్రేమను చాటుకున్నాడు.
07:33 April 06
కమల్ ఓటు...
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్.. చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్‌తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు కూడా ఓటేశారు.
07:22 April 06
రజనీ ఓటు..
ప్రముఖ సినీ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్.. తమిళనాడు చెన్నెలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వాస్తవానికి తమిళ పోరులో రజనీ కూడా బరిలో దిగాల్సి ఉంది. కానీ ఆరోగ్య కారణాలతో చివరి నిమిషంలో ఆయన రాజకీయల నుంచి తప్పుకున్నారు.
07:09 April 06
మెట్రోమ్యాన్ ఓటు...
మెట్రోమ్యాన్ శ్రీధరన్.. కేరళ పొన్నానిలోని ఓ పోలింగ్ బూత్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
07:07 April 06
మోదీ ట్వీట్..
4 రాష్ట్రాలు- ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రజలు భారీ సంఖ్యల్లో వచ్చి.. రికార్డు స్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
07:02 April 06
మెట్రోమ్యాన్...
మెట్రోమ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్.. కేరళ పొన్నాని నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌కు వెళ్లారు. అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇటీవలే భాజపాలో చేరిన శ్రీధరన్.. భాజపా టికెట్‌పై పాలక్కడ్ నుంచి ఎన్నికల బరిలో దిగారు.
06:58 April 06
పోలింగ్ షురూ...
దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటింగ్ ప్రారంభమైంది. కరోనా నిబంధనలు- కట్టుదిట్ట భద్రత మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కేరళ, తమిళనాడు, బంగాల్(మూడో దశ), అసోం(మూడో దశ), పుదుచ్చేరిలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
06:51 April 06
అసోంలో..
పోలింగ్ ప్రారంభానికి ముందే.. అసోంలోని పలు పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అసోంలో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా.. రెండింటిలోనూ 75శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
06:49 April 06
ఏర్పాట్లు ఇలా...
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
06:33 April 06
లైవ్:9:30 గంటల వరకు బంగాల్, అసోంలో 14 శాతం పోలింగ్
దేశంలో ఓట్ల పండగకు సమయం ఆసన్నమైంది. మరికొద్దిసేపట్లో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలతో పాటు బంగాల్(మూడో దశ), అసోం(మూడో దశ)కు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్ జరగనుండగా.. బంగాల్లో 31, అసోంలో 40 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.