ఎగసిపడుతున్న అలలు..
నివర్ తుపాను ప్రభావంతో.. తమిళనాడు చెన్నైలోని మెరీనా బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
19:18 November 25
ఎగసిపడుతున్న అలలు..
నివర్ తుపాను ప్రభావంతో.. తమిళనాడు చెన్నైలోని మెరీనా బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
17:30 November 25
పెనుతుపానుగా మారిన నివర్
17:18 November 25
నివర్ ఎఫెక్ట్- పలు రైళ్లు రద్దు
17:00 November 25
తుపాను దృష్టా సెలవు..
నివర్ తుపాను కారణంగా రేపు కూడా 13 జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించారు ముఖ్యమంత్రి పళనిస్వామి.
16:53 November 25
ప్రధాన రహదారుల మూసివేత..
16:48 November 25
రైళ్ల దారి మళ్లింపు..
నివర్ తుపాను నేపథ్యంలో ఇప్పటికే 7 రైళ్లను రద్దు చేసిన దక్షిణ రైల్వే... మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తోన్నట్లు పేర్కొంది. సంబంధిత జాబితాను వెబ్సైట్లో ఉంచింది.
16:43 November 25
మామల్లపురంలో భారీ వర్షాలు..
తమిళనాడు మామల్లపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరింది. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నివర్ తుపాను మామల్లపురం-కరైకల్ వద్ద తీరం దాటనుంది.
16:08 November 25
'3 రాష్ట్రాలకు 25 బృందాలు'
నివర్ తుపాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండనున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు 25 బృందాలను పంపించినట్లు తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్. కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని.. రెండు రోజులుగా క్షేతస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు.
తరలింపు..
'నివర్' దృష్ట్యా.. ముంపు ముంగిట ఉన్న తమిళనాడులోని దాదాపు 30 వేల మంది, పుదుచ్చేరిలోని 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాన్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కలిసి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నష్టాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
16:04 November 25
భీకరగాలులు..
తమిళనాడులోని మామల్లపురంలో భీకరగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మామల్లపురం-కరైకల్ వద్ద ఈరోజు అర్ధరాత్రి తర్వాత.. నివర్ తుపాను తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఆ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
15:47 November 25
తీవ్ర తుపానుగా నివర్..
15:06 November 25
నివర్ తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూనమల్లే హై రోడ్డు వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై భారీగా వరదనీరు చేరింది.
14:56 November 25
7 రైళ్లు రద్దు చేసిన దక్షిణ రైల్వే..
నివర్ తుపాను దృష్ట్యా.. 7 రైళ్లను రద్దు చేసింది దక్షిణ రైల్వే. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది.
14:55 November 25
ఎన్డీఆర్ఎఫ్ బలగాల అప్రమత్తం..
14:52 November 25
నివర్ ఎఫెక్ట్- ఆ ప్రాంతాల్లో వర్షాలు..
13:51 November 25
నివర్ తుపాను కారణంగా చెన్నై నుంచి వెళ్లే, వచ్చే మొత్తం 26 విమానాలను రద్దు చేశారు. ఈ మేరకు చెన్నై విమానాశ్రయం తెలిపింది.
13:42 November 25
ఇళ్లలోనే ఉండాలి..
తుపాను కారణంగా ప్రజలను ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కోరారు.
ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నాను. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. ఆహారం, మందులు అవసరమున్న 80 ప్రాంతాలను గుర్తించి తగిన సహాయం చేస్తున్నాం. 12 గంటల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తాం.
- నారణయణస్వామి, పుదుచ్చేరి సీఎం
13:36 November 25
రైళ్ల రద్దు
తుపాను కారణంగా ఈరోజు రెండు, గురువారం మూడు, 28న ఒక రైలును దక్షిణ రైల్వే రద్దు చేసింది.
13:34 November 25
నివర్ తుపాను కారణంగా గురువారం కూడా 13 జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.
13:23 November 25
నది గేట్లు ఎత్తివేత..
వరద నీరు ఎక్కువగా రావడం వల్ల చెంబరంబక్కం చెరువు గేట్లను ఎత్తివేశారు అధికారులు. నీటిని అడయార్ నదిలోకి విడిచిపెట్టారు అధికారులు.
13:17 November 25
భారీ వర్షాలు..
తమిళనాడులోని తంజావుర్, తిరువూర్, నాగపట్నం, కడలూర్, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, మైలదుతైరై, అరియలూర్, కల్లకుర్చి, విల్లుపురం, తిరువన్నమలై జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ విభాగం తెలిపింది.
13:06 November 25
ఏర్పాట్లను సమీక్షించిన సీఎం
'నివర్' తుపాను తీరాన్ని తాకనున్న నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి.. పలు ప్రాంతాల్లో పర్యటించి సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
12:25 November 25
"నివర్ తుపాను క్రమంగా బలపడుతోంది. భారీ వృక్షాలు నేలకూలడం , పూరిళ్ల పైకప్పులు ఎగిరిపోయే అవకాశం ఉంది. అరటి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. బలమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయి. పుదుచ్చేరి-కరైకల్పై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది."
- డా. మృత్యుంజయ మహోపాత్ర, ఐఎమ్‌డీ డీజీ
12:20 November 25
తమిళనాడు మామల్లపురంలో బలమైన గాలులు వీస్తున్నాయి. నివర్ తుపాను ఈరోజు అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.
12:16 November 25
నివర్ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలకు అండగా సైన్యం సిద్ధంగా ఉంది. విపత్తు స్పందన దళాలు సిద్ధంగా ఉన్నట్లు భారత సైన్యం దక్షిణ కమాండ్ తెలిపింది.
11:58 November 25
తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న 'నివర్'
తమిళనాడు తీరం వైపు తీవ్ర తుపాను నివర్ దూసుకొస్తుంది. గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది.
ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. పుదుచ్చేరికి 310 కి.మీ. దూరంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. కొద్దిగంటల్లో పెను తుపానుగా బలపడుతున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. రాత్రికి మామళ్లపురం- కరైకల్ మధ్య తీరం దాటుతుందని స్పష్టం చేసింది ఐఎండీ. ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ. మేర వర్షం పడినట్లు వెల్లడించిన ఐఎండీ.