ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు రోజుల ముందుగానే లోక్సభ కార్యకలాపాలు ముగియనున్నట్లు సచివాలయ కార్యాలయం తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉండగా తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 13నే(శనివారం) చివరిరోజు కానుంది.
దీనిపై ఫ్లోర్ లీడర్లు అందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఫిబ్రవరి 13న ప్రశ్నోత్తరాల సమయం ఉండదని పేర్కొంది. అయితే శనివారం కూడా సభ నిర్వహణతో సిట్టింగుల సంఖ్యలో మార్పేమీ ఉండదని స్పష్టం చేసింది లోక్సభ కార్యాలయం.