తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లివ్ ఇన్ రిలేషన్​షిప్​తో లాభమా? నష్టమా? - Live in Relationship Uses

Live in Relationship : "లిన్ ఇన్ రిలేషన్​షిప్.." ఒకప్పుడు బయటిదేశాల్లో, సినిమాల్లో చూసేవాళ్లం. కానీ.. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ కల్చర్ పెరిగిపోయింది. చాలా మంది పెళ్లికి ముందు లివ్ ఇన్ రిలేషన్​లో ఉంటున్నారు. మరి.. ఇది లాభమా? నష్టమా?

Live in Relationship
Live in Relationship

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 12:24 PM IST

Live in Relationship Good and Bad : పెళ్లికాకముందు అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటం అనేది సమాజ విరుద్ధమైన అంశంగా గతంలో ఉండేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు విదేశాలలో మాత్రమే చూసే 'లివ్ ఇన్ రిలేషన్​షిప్'.. ఇప్పుడు మనదేశంలోనూ కొనసాగుతోంది. ముఖ్యంగా నగరాల్లోని నేటితరం ఈ కల్చర్​ను ఫాలో అవడానికి మొగ్గు చూపుతోంది. మరి.. ఈ లివ్ ఇన్ రిలేషన్ వల్ల లాభమా? నష్టమా? అంటే.. కొంచెం ఇష్టం-కొంచెం నష్టం అంటున్నారు మానసిక నిపుణులు. మరి.. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టెస్టింగ్ టైమ్‌ఫ్రేమ్ : వివాహానికి ముందు జీవిత భాగస్వామితో కలిసి ఉండడం వల్ల.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఈ బంధాన్ని భవిష్యత్తులో నిలుపుకోగలమా? లేదా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. మీరు పార్ట్​నర్​తో నివసిస్తున్నప్పుడు.. వారి దినచర్య గురించి.. అలవాట్లు, ప్రవర్తన గురించి లోతైన అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వారితో వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఓ క్లారిటీకి రావడానికి లివ్​ ఇన్ చక్కగా ఉపయోగపడుతుంది.

మనీ మేనేజ్​ మెంట్ : ఒక కుటుంబం సజావుగా కొనసాగాలంటే.. ఆర్థిక నిర్వహణ చాలా ఇంపార్టెంట్. లివ్ ఇన్ రిలేషన్​ ద్వారా పెళ్లికి ముందే కుటుంబ ఖర్చుల గురించిన అవగాహన కొంతమేర తెలుస్తుంది. ఇంటి కిరాయి, నెలవారీ ఖర్చులు వంటి వాటికి మనీ మేనేజ్ చేయడం తెలిసి వస్తుంది. కాబట్టి.. రేపు పెళ్లి తర్వాత ఉన్నట్టుండి కుటుంబ బాధ్యతలు నెత్తిన పడ్డాయనే ఆందోళన తగ్గుతుంది.

అండర్ స్టాండింగ్ :ఉన్నట్టుండి పెళ్లి చేసుకుంటే.. భాగస్వామి మనస్తత్వం ఏంటో తెలియదు. అలవాట్లు, ఆలోచనా విధానం ఎలా ఉంటాయో అర్థంకాదు. ఇద్దరిదీ పూర్తి భిన్నమైన స్వభావమైతే.. ఇక జీవితాంతం ఇబ్బంది పడుతూ సంసారం కొనసాగించాల్సిందే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు లివ్ ఇన్ ఉపయోగపడుతుంది. భాగస్వామి బిహేవియర్ నుంచి ఇష్టాఇష్టాల వరకు అన్నిటిపైనా ఓ అవగాహన వస్తుంది కాబట్టి.. పెళ్లి చేసుకోవాలా లేదా? అనే క్లారిటీకి రావొచ్చు. నచ్చిన వారే లివ్​ ఇన్​కు సిద్ధమవుతారు కాబట్టి.. ఇద్దరూ మేడిన్ ఈచ్ అదర్ అనుకుంటే.. ఈ లివ్ ఇన్ ద్వారా వారి బాండింగ్ మరింత బలపడుతుంది. పెళ్లి తర్వాత ఫ్యూచర్​ పెద్దగా కలతలు లేకుండా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది.

డిసైడ్ చేసుకోవచ్చు : లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇద్దరికీ సరిపడదనే నిర్ణయానికి వస్తే.. ఈజీగా విడిపోవచ్చు. వీరికి పెళ్లి కాలేదు కాబట్టి.. చట్టబద్ధంగా కట్టుబడి ఉండరు కాబట్టి.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. విడిపోవాలనే నిర్ణయం పెళ్లి తర్వాత తీసుకోవడం చాలా పెద్ద విషయం. ఇంకా.. పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవడం అతిపెద్ద అంశం. జీవితాలనే తారుమారు చేస్తుంది. కాబట్టి.. ఫ్యూచర్​ ను డిసైడ్ చేసుకొని.. కలిసుండాలా? విడిపోవాలా? అనేది నిర్ణయించుకోవడానికి లివ్ ఇన్​లో ఈజీ ఆప్షన్ ఉంటుంది.

Tips For Dating to Marriage: డేటింగ్​ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మరిచిపోవద్దు!

సామాజిక కళంకం : లివ్​ ఇన్​ రిలేషన్​లో పలు పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నప్పటికీ.. నెగెటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ముందుగా.. మనదేశ సంస్కృతిలో ఇది అవాంఛనీయమైనది. కాబట్టి.. పెళ్లి కాకుండా కలిసి జీవించాలనుకునే జంటలకు ఇళ్లు దొరకడం కష్టం. ఒకవేళ అద్దెకు దొరికినా.. ఇరుగుపొరుగువారు ఒకవిధమైన భావనతో మిమ్మల్ని చూస్తారు. దీంతో.. మనసులో ప్రతికూల భావోద్వేగాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవిధమైన అభద్రత, ఆందోళన, ఒత్తిడి నిత్యం మనసును ఇబ్బంది పెట్టొచ్చు.

తొందరపాటు : ఈ రిలేషన్​లో ఉన్నవారు మెజారిటీ ఆకర్షణతో ఉంటారు. కాబట్టి.. శారీరకంగా దగ్గరయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా జరిగిన కొన్ని నెలల తర్వాత అభిప్రాయాలు కలవలేదనో.. మరో కారణంతోనో పెళ్లి వద్దు అనుకుంటే అది పలు ఇబ్బందులకు దారి తీస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వంటివి కన్ఫామ్ అయితే.. అది మరో పెద్ద సమస్యగా మారుతుంది.

నిర్ణయం పక్కాగా :పెళ్లికి ముందు రిలేషన్​లో ఉండడం అన్నది కత్తిమీద సాములాంటిది. తేడావస్తే పరిణామాలు ఇబ్బందిగా ఉండొచ్చు. అందువల్ల పాజిటివ్, నెగెటివ్ అంశాలన్నీ ఆలోచించుకొని.. పార్ట్​నర్​ తత్వాన్ని అంచనా వేసి.. ఆ తర్వాతే లివ్​ ఇన్​లోకి అడుగు పెట్టాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

బీ అలర్ట్‌ : మీరు విడాకుల వైపు పయనిస్తున్నట్టే - ఈ సూచనలు దానికే సంకేతం!

ABOUT THE AUTHOR

...view details