ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు నోట్లు ఇచ్చే రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్. హామీలు నిజాయితీగా ఉండాలన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని వ్యక్తులకు రూ.5 వేలు చేతిలో పెడితే తీసుకుంటున్నారని.. ఆ ధోరణి మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అవినీతిని నిర్మూలించాల్సిన సమయం వచ్చిందన్న కమల్.. అది ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందుకు ప్రజల సాయం కావాలని మధురై ప్రచార సభలో అన్నారు.
"తగిన ప్రణాళికలు లేకుండా ఏ రంగంలోకీ అడుగుపెట్టను. ప్రభుత్వమే ప్రజల కనీస అవసరాలు తీర్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రజలు రాజకీయలను తమ చేతుల్లోకి తీసుకోవాలి" అని కమల్ పేర్కొన్నారు.