తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు మృతి - మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు మృతి

కరోనా వ్యాప్తి వల్ల వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో ఆల్కహాల్ దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాణి పట్టణంలో జరిగింది.

die
శానిటైజర్ తాగి ఐదుగురు మృతి

By

Published : Apr 24, 2021, 3:39 PM IST

Updated : Apr 24, 2021, 5:07 PM IST

మహారాష్ట్రలో లాక్​డౌన్​ కారణంగా వైన్ షాపులను మూసివేశారు. దాంతో మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వాణి పట్టణంలో జరిగింది.

ఆల్కహాల్ లేకపోడం వల్ల దత్త లింగేశ్వర్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి 9గంటలకు శానిటైజర్ తాగాడు. ఫలితంగా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రి11గంటలకు అతను చనిపోయాడు. అదే పట్టణానికి చెందిన గణేశ్ షెలార్, సునిల్ కూడా శానిటైజర్ తాగడం వల్ల శుక్రవారం రాత్రి చనిపోయారు. నూతన్ పతార్కర్ అనే మరో వ్యక్తి శానిటైజర్ తాగడం వల్ల ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం అతను మరణించాడు. అలాగే సంతోష్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కూడా శానిటైజర్ తాగడం వల్లే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇదీ చదవండి:'కరోనాను తొలుత జయించేది గ్రామాలే'

Last Updated : Apr 24, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details