Liquor Mafia Attack on Police :లిక్కర్ మాఫియాకు అడ్డువస్తున్నాడనే కారణంతో ఓ పోలీస్ కన్ను పీకేశారు కొందరు వ్యక్తులు. పదునైన కత్తులు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మద్యం విక్రయాలపై నిషేధం ఉన్న బిహార్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాంకా జిల్లాలోని అమర్పుర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న మహదేవ్పుర్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన మిథిలేశ్ శర్మ, అతడి కుమారులు రోహిత్ కుమార్, ఛోటూ కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితుడు లఖ్పతి సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
"ఝార్ఖండ్ సాయుధ పోలీసుగా నా భర్త పనిచేస్తున్నారు. నేను నా భర్త ఇంటి ముందు కూర్చున్న సమయంలో.. ఈ దాడి జరిగింది" అని లఖ్పతి సింగ్ భార్య తెలిపింది. వారి అక్రమ మద్యం దందాకు అడ్డు వస్తున్నందుకే నిందితులు ఈ దాడికి ఒడిగట్టారని ఆమె ఆరోపించింది.
బాధితుడు పోలీస్ లఖ్పతి సింగ్ దాడి సమయంలో లఖ్పతిసింగ్ భార్య అరుపులు విన్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు ముగ్గురు పరారయ్యారు. అనంతరం బాధితుడ్ని అసుపత్రికి తరలించారు. లఖ్పతి భార్య ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
భార్య ప్రైవేటు భాగంలోకి కర్రను చొప్పించి..
Husband Insert Stick in Wife Private Part: భార్య ప్రైవేటు భాగంలో కర్రను చొప్పించి.. అతి క్రూరత్వానికి పాల్పడ్డాడు ఓ భర్త. తల్లిదండ్రులతో కలిసి మద్యం మత్తులో ఆమెపై దాడి చేసి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
కుమార్తెపై దాడి దాడి గురించి విషయం తెలుసుకున్న మహిళ తల్లిందండ్రులు.. బాధితురాలితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. తొమ్మిదేళ్ల క్రితం తనకు వివాహమైందని బాధితురాలి పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచే భర్త, అత్తమామలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.