తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుకు నలుగురు చిన్నారులు బలి.. పకోడి తిని మరో 24 మంది.. - two dead in nagpru short circuit

వర్షంలో చెట్టు కింద తలదాచుకున్న నలుగురు పిల్లలు పిడుగుపాటుగు గురై మృతి చెందారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు, దిల్లీలో ట్రాక్టర్​ ఢీకొట్టి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

lightning kills four childrenv
lightning kills four childrenv

By

Published : May 1, 2023, 10:02 AM IST

Updated : May 1, 2023, 11:38 AM IST

ఝార్ఖండ్​లో దారుణం జరిగింది. పిడుగుపాటుకు గురై నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సాహిబ్​ గంజ్​ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాహ్​మహల్​ ప్రాంతంలోని రాధానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మామిడి కాయలు కోయడానికి కొందరు పిల్లలు మామిడి తోటకు వెళ్లారు. బలమైన ఈదురు గాలులతో భారీగా వర్షం కురిసింది. దీంతో చిన్నారులు అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కిందకు వెళ్లారు. అకస్మాత్తుగా పిడుగు పడటం వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. మరొ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్​ ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి.
దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఈశాన్య దిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో ట్రాక్టర్ ఢీకొని రెండేళ్ల బాలుడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్​కు చెందిన ఇద్రీస్​గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కేడే అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సూభాష్​ నగర్​కు చెందిన ఓ వ్యక్తి తన పిల్లలతో స్కూటీపై వెళ్తున్నాడు. పెద్ద కుమార్తె స్కూటీ వెనుక కూర్చుంది. కాగా, స్కూటీ సీటు ముందు రెండేళ్ల కుమారుడు నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో భజన్‌పురాలోని జిల్లీ దర్బార్ రోడ్‌లో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు, స్కూటీ స్లిప్​ అయింది. దీంతో రెండేళ్ల బాలుడు ట్రాక్టర్ కింద పడ్డాడు. పరిస్థితి విషమించడం వల్ల, సమీపంలోని పంచశీల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు బాలుడు చనిపోయాడని ధ్రువీకరించారు.

గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి..
ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో పునాది తవ్వుతుండగా గోడ కూలి ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీస్​ స్టేషన్​ ఫేజ్ -3 పరిధిలోని ఎఫ్​ఎన్​జీ విహార్​ సెక్టార్​-121 ప్రాంతంలో ఓ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంటి పునాది తవ్వుతుండగా కింద నేల కూలింది. దీంతో మహ్మద్ షాజాద్ (5), అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కూలీలు గాయపడ్డారు. మట్టి కింద చిక్కుకుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

నిద్రలోనే ఇద్దరు వ్యక్తులు మృతి..
మహారాష్ట్రలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు అంటుకోవడం వల్ల.. ఊపిరాడక ఇద్దరు వ్యక్తుల మృతిచెందారు. మృతులను ఫ్లెక్స్​ బోర్డ్​ తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తున్న ఆకాశ్​, రజత్​గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నాగ్​పుర్​ నగరంలోని.. ఇమామ్​వాడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. రాత్రి షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఎలక్ట్రికల్​ బోర్టులో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ వచ్చింది. నిద్రలో ఉన్న బాధితులు ఆ గాలి పీల్చడం వల్ల నిద్రలోనే చనిపోయారని పోలీసులు అంచనా వేస్తున్నారు. తర్వాత రోజు బాధితులు ఎంతకూ స్పందన రాకపోవడం వల్ల.. తలుపులు పగలగొట్టి చూడగా.. విగత జీవులుగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్రం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పకోడి తిని పలువురు అస్వస్థత..
ఛత్తీస్​గఢ్​లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దాదాపు 24 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. సమాచారం అందుకున్న ఓ ఆరోగ్య శాఖ బృందం గ్రామంలోనే బాధితులకు చికిత్స అందిస్తోంది. ఈ ఘటన కొండగావ్​ జిల్లా ఉడబెడ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చిన్​హిలీబెడా గ్రామంలో జరిగింది. అయితే, నిశ్చితార్థానికి హాజరైన అతిథులకు వేయించిన పకోడీలు వడ్డించారని.. అది తిన్నాకే అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.

Last Updated : May 1, 2023, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details