LIC Jobs 2023 :ఎల్ఐసీలో అప్రెంటీస్ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించి అన్ని రీజియన్లలోని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ శాఖల్లో అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ. ఈ మేరకు 250 ఖాళీలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
LIC Housing Finance Apprenticeship : అప్రెంటీస్- 250 పోస్టులు
విద్యార్హత
LIC Apprenticeship Qualification :అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఏజ్ లిమిట్
LIC Apprenticeship Age Limit :2023 డిసెంబర్ 01 నాటికి అభ్యర్థులు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము(LIC Apprenticeship Application Fees)
- దివ్యాంగ అభ్యర్థులకు రూ.472
- ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు- రూ.708
- జనరల్ కేటగిరీ, ఓబీసీ అభ్యర్థులకు- రూ.944
ఎంపిక ప్రక్రియ(LIC Housing Finance Apprenticeship Selection Process)
- రాత పరీక్ష(ఆన్లైన్)
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.