తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైసూర్​లో 'ఎస్పీబీ' అధ్యయన కేంద్రం - మైసూర్​ విశ్వవిద్యాలయం

మైసూర్ విశ్వవిద్యాలయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య హేమంత్ కుమార్ రాసిన లేఖకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

Letter to Government for setting up of SPB study centre in Mysore University: Chancellor Prof. Hemant Kumar
ఎస్పీబీ జీవితంపై అధ్యయన కేంద్రం

By

Published : Mar 10, 2021, 12:03 PM IST

దివంగత గాయకుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితంపై కర్ణాటకలోని మైసూర్​ విశ్వవిద్యాలయంలో శాశ్వత అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది.

గత నవంబర్​లో ఏర్పాటైన తాత్కాలిక కేంద్రానికి రూ.5లక్షలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎస్పీబీ శాశ్వత అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మైసూర్ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హేమంత్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

'' ఎస్పీబీ జీవితంలోని భిన్న కోణాలపై పరిశోధనలతో పాటు.. సినీ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలపై అధ్యయనం కోసం ఫైన్ ఆర్ట్స్​ కళాశాలలో ఒక ప్రొఫెసర్‌ను నియమించాం. ఈ కేంద్రం ఏప్రిల్​ నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తుంది.''

-హేమంత్​ కుమార్, మైసూర్​ విశ్వవిద్యాలయ కులపతి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై అధ్యయనం చేయాలని గేయ రచయిత హంసలేఖ ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:బాలూ స్వరం దేవుడిచ్చిన వరం: అమితాబ్

'సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడైతే.. బాలు చంద్రుడు'

'ఎస్పీబీ లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో!'

ABOUT THE AUTHOR

...view details