తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాతో రన్నింగ్​ రేస్​కు రా'.. సీఎంకు ప్రతిపక్ష నేత సవాల్ - మధ్యప్రదేశ్​ ప్రతిపక్షనేత

తన ఆరోగ్యం, వయసు గురించి పదేపదే విమర్శలు గుప్పిస్తున్న మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు ఓ సవాల్​ విసిరారు కాంగ్రెస్​ నేత కమల్​నాథ్(Kamal Nath news today)​. "ఇద్దరం రన్నింగ్​ రేసులో పాల్గొని ఎవరి ఫిట్​నెస్​ ఏంటో పరీక్షించుకుందాం రమ్మని" ఛాలెంజ్​ చేశారు. కొవిడ్​ తర్వాత చికిత్స కోసమే దిల్లీ వెళ్లినట్లు స్పష్టం చేశారు కమల్​నాథ్​.

Kamal Nath throws challenge at MP CM Chouhan to test fitness
సీఎంకు ప్రతిపక్ష నేత సవాల్

By

Published : Oct 3, 2021, 4:18 PM IST

మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​(62)(Shivraj Singh Chauhan age) దమ్ముంటే తనతో రన్నింగ్​ రేస్​కు రావాలని సవాల్​ చేశారు ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు కమల్​నాథ్​(72)(Kamal Nath age). పదేపదే తన ఆరోగ్యం, వయసు గురించి విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"నా ఆరోగ్యంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కమల్​నాథ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారని, వృద్ధుడని శివరాజ్‌ చెబుతున్నారు. శివరాజ్​.. నేను మీకు ఒక సవాల్​ విసురుతున్నాను. రండి.. మనం ఓ రేసులో పాల్గొందాం."

- కమల్​నాథ్​, మధ్యప్రదేశ్ కాంగ్రెస్​ అధ్యక్షుడు

"నాకు నిమోనియా ఉన్నందున.. కొవిడ్​-19 తర్వాత చికిత్స కోసం దిల్లీ వెళ్లాను. ఇది ఎవరికైనా ఉంటుంది. అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి. నివేదికలన్నీ నాకు అనుకూలంగా వచ్చాయి. కొవిడ్​ రెండు రకాలు.. షార్ట్​ కొవిడ్​.. లాంగ్​కొవిడ్​. నేను లాంగ్ ​కొవిడ్​ను ఎదుర్కొన్నాను. అంతమాత్రాన నేను అస్వస్థతతో దిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కాదు. నాకు చాలా బాధ్యతలు(కాంగ్రెస్​కు సంబంధించి) ఉన్నాయి." అని కమల్​నాథ్(Kamal Nath news today)​ పేర్కొన్నారు.

అక్టోబరు 30న మధ్యప్రదేశ్​లో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు(madhya pradesh bypoll 2021) జరగనున్నాయి. ఇందుకు కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితాను తీసుకుని కమల్​నాథ్​ దిల్లీకి వెళ్లాల్సి ఉందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.

కమల్​నాథ్​ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర భాజపా సీనియర్ నేత దీపక్ విజయవర్గీయ.. "భాజపా ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం పోటీ పడుతోంది. కానీ డ్రాయింగ్​ రూముల్లో కూర్చొని ట్విట్టర్‌లో కాంగ్రెస్ రేస్​లు నిర్వహిస్తోంది. ఉపఎన్నికల్లో(madhya pradesh bypoll 2021) ఎవరు విజేతలో ప్రజలే నిర్ణయిస్తారు. కమల్​నాథ్ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కరోనాను జయించిన నాథ్​ బాగుండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

కమల్​నాథ్, చౌహాన్.. ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. గతేడాది ఆగస్టులో వైరస్​ నుంచి చౌహాన్​ కోలుకున్నారు.

ఇదీ చూడండి:భవానీపుర్​లో దీదీ విజయఢంకా- 58 వేల ఓట్ల తేడాతో గెలుపు

ABOUT THE AUTHOR

...view details