లష్కరే తోయిబా ఉగ్రవాదికి చెందిన రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. పుల్వామాలోని పాంపోర్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.
ఉగ్రవాది రహస్య స్థావరం ఛేదించిన పోలీసులు ఉగ్రవాద స్థావరానికి సంబంధించి తమకు సమాచారం అందగానే అవంతిపొరా పోలీసులు అప్రమత్తమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఛంధార గ్రామంలో ఈ స్థావరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసిన జమ్మూ పోలీసులు "సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం సంబంధిత గ్రామంలో తనిఖీ నిర్వహించాం. ఛంధార గ్రామంలోని ఓ ఆవుల కొట్టంలో ఉగ్రవాది స్థావరాన్ని ఛేదించాం. ఈ స్థావరం దాదాపు 6 ఫీట్లు ఉంది"
-పోలీసు అధికారి, జమ్ముకశ్మీర్.
ఉగ్రవాది స్థావరం నుంచి 26రౌండ్ల ఏకే-47 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుస్తులు, ఇతర వస్తువులు ఆ స్థావరంలో లభ్యమైనట్లు పేర్కొన్నారు.
పాక్ దుశ్చర్య..
మరోవైపు.. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్థాన్. తాజాగా రాజౌరీ, పుంఛ్, కతువా జిల్లాలో మోర్టార్ షెల్స్‌తో దాడికి దిగింది. పాక్ దుశ్చర్యకు భారత్ దీటుగా బదులిచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పాక్ ఈ చర్యకు పాల్పడినట్లు భద్రతాదళ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:టీకా పేరుతో సైబర్ వల- చిక్కకుండా ఉందాం ఇలా..