తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు అమ్మాయిల ప్రేమ వివాహం- పెద్దలు ఏం చేశారంటే..? - ఇద్దరు యువతుల ప్రేమ వివాహం

Lesbians Love: చాలా కాలంగా ప్రేమించుకున్న ఇద్దరు స్వలింగ సంపర్క యువతులు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తాము జీవితాంతం కలిసి జీవించాలనుకుంటున్నామని చెప్పారు. చివరకు కుటుంబ సభ్యులు వచ్చి ఇద్దరినీ ఒప్పించి తీసుకెళ్లిపోయారు.

lesbian-love-in-dhanbad
లెస్బియన్ల ప్రేమ వివాహం

By

Published : Feb 7, 2022, 5:34 PM IST

Lesbians Marriage ఝార్ఖండ్​లోని ధన్​బాద్​లో ఇద్దరు యువతులు చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి గుడిలో వివాహం చేసుకున్నారు. తాము ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నామని స్వయంగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి చెప్పారు.

లెస్బియన్ల ప్రేమ వివాహం

ఈ యువతుల పేర్లు రాఖి మిర్ధా(24), కరిష్మా రావత్​(23). జోరఖ్​పుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని జామాడోబాలో నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరూ తమ తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​లో తమ పిల్లలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం రోజు ఇద్దరు యువతులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. తాము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని, జరియాలోని దుఖ్​రనీ ఆలయంలో పెళ్లికూడా చేసుకున్నామని చెప్పారు. పోలీసులు వెంటనే వారి కుటుంబసభ్యులను స్టేషన్​కు రప్పించారు.

Lesbians Love

స్టేషన్​కు వెళ్లిన ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరు యువతులకు నచ్చజెప్పేందుకు గంటలు పాటు శ్రిమించారు. చివరకు ఎలాగోలా ఇద్దరినీ ఒప్పించి తమ తమ ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.

ధన్​బాద్​లో ​ స్వలింగ సంపర్కుల వివాహాలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరొక యువతితో కలిసి జీవించింది. కుటుంబసభ్యులు ఒత్తిడి చేయగా.. ఇద్దరూ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:భర్తను కోల్పోయిన స్నేహితుడి భార్యకు పెళ్లితో 'పునర్జన్మ'!

ABOUT THE AUTHOR

...view details