నిషేధిత జంతు చర్మాలను ఇంట్లో దాచుకున్న కారణంగా.. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. ఈ మేరకు.. దక్షిణ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా షేర్పొరా ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం.. పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్ - జంతు చర్మాలు దాచి ఓ వ్యక్తి అరెస్టు
జంతువుల చర్మాలు ఇంట్లో దాచిన కారణంగా జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లోని ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులతో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో 12 చిరుత పులుల చర్మాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
![జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్ Leopard hides and bear bladders recovered in south Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10438175-thumbnail-3x2-animal-skin.jpg)
జంతు చర్మాలు ఇంట్లో దాచి-ఓ వ్యక్తి అరెస్టు
అరెస్టయిన వ్యక్తి ఇంట్లో 12 చిరుత పులుల చర్మాలు, 38 ఎలుగుబంటి శరీరంలోని అవయవాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. తనిఖీ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పక్షుల లెక్కలు.. 6 కొత్త జాతుల గుర్తింపు