తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోవడం వల్లే సమస్యలు!'

Constitution Day 2021: చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకుండా శాసనసభ ఆమోదించటం ద్వారా.. ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ(cji nv ramana news). దాని ఫలితంగా న్యాయ వ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందన్నారు.

CJI
సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ

By

Published : Nov 27, 2021, 6:32 PM IST

Updated : Nov 27, 2021, 8:15 PM IST

Constitution Day 2021:చట్టాల ప్రభావాన్ని అంచనా వేయటం, వాటిపై శాసనసభ అధ్యయనం చేయకపోవడం వల్ల.. ఒక్కోసారి పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ(CJI NV Ramana). దాని ఫలితంగా న్యాయవ్యవస్థపై కేసులు భారం పెరిగిపోతుందన్నారు.

రాజ్యాంగ దినోత్సవ(Constitution Day) ముగింపు సమావేశంలో జడ్జీలు, న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు సీజేఐ. ప్రత్యేక మౌలిక వసతులు కల్పించకుండా ప్రస్తుతం ఉన్న కోర్టులను కమర్షియల్​ కోర్టులుగా మార్చినంత మాత్రాన పెండింగ్​ కేసులపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు(cji of india).

ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్​ రిజిజులు పాల్గొన్నారు.

హాజరైన సీజేఐ, రాష్ట్రపతి, న్యాయ శాఖ మంత్రి

"మనకు ఎలాంటి విమర్శలు, అడ్డంకులు వచ్చినా.. న్యాయం చేయాలనే లక్ష్యం ఆగకూడదని గుర్తుంచుకోవాలి. ప్రజల హక్కుల పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి మన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగాలి. న్యాయవ్యవస్థలో పెండింగ్​ కేసుల సమస్య బహుముఖంగా ఉంటుంది. రెండు రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోని సూచనలు పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉంది. మరో సమస్య.. శాసనసభ అధ్యయనాలు చేపట్టదు. అది ఆమోదించిన చట్టాలను అంచనా వేయదు. దాని వల్ల ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారితీస్తుంది. దీనికి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్​ 138 ఉదాహరణ. ఇప్పటికే పనిభారంతో ఇబ్బందులు పడుతున్న న్యాయమూర్తులపై ఈ చట్టం పరిధిలో వేలాది కేసులు వచ్చి పడుతున్నాయి."

- జస్టిస్​ ఎన్​వీ రమణ, సీజేఐ

నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్స్​ చట్టంలోని సెక్షన్​ 138.. బ్యాంకు ఖాతాల్లో సరైన నిధులు లేకుండా చెక్కులను ఇవ్వటాన్ని తప్పుగా పరిగణిస్తోంది.

రాజ్యాంగ దినోత్సవ ముగింపు కార్యక్రమం

న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.9వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు సీజేఐ(cji of india). అయితే, నిధులు సమస్య కాదని, కొన్ని రాష్ట్రాలు అందుకు తగినట్లుగా నిధులను ఖర్చు చేయయకపోవటమే సమస్యగా మారిందని చెప్పినట్లు గుర్తు చేశారు. దాని ఫలితంగా భారీగా నిధులు నిరుపయోగంగా మారుతున్నాయని తెలిపారు. ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:'రాజ్యాంగ బలంతోనే అభివృద్ధి పథంలో దేశం'

Constitution Day 2021: ఆర్డినెన్సులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు!

Last Updated : Nov 27, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details