బిహార్లో మహాకూటమితో జతకట్టి బరిలోకి దిగిన వామపక్షాలు 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 29 స్థానాల్లో వామపక్షాలు పోటీ చేశాయి. మహాకూటమికి నేతృత్వం వహించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పార్టీ నేతలు వారించినప్పటికీ వామపక్షాలకు 29 సీట్లను కేటాయించారు. ఇది కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. సీపీఐ(ఎం) 4, సీపీఐ 6, సీపీఐ (ఎమ్ఎల్) 19 సీట్లలో పోటీ చేశాయి.
బిహార్ సమరంలో మెరిసిన కామ్రేడ్స్!
ఎన్నికల్లో ఉనికిని కోల్పోతున్న వామపక్షాలు ప్రస్తుత బిహార్ ఎన్నికల్లో మెరిశాయి. పోటీ చేసిన 29 స్థానాల్లో 19 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.
బిహార్ సమరంలో మెరిసిన కామ్రెడ్స్
2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందగా, 2015లో సీపీఐ (ఎమ్ఎల్) మూడు చోట్ల గెలుపొందింది.
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు ఓటమినే చవిచూశాయి. తమకు పట్టున్న బంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ తమ ప్రాభవాన్ని కోల్పోయి. ఇలాంటి తరుణంలో బిహార్లో కామ్రేడ్లు పుంజుకోవడం వామపక్షాలను పునరుత్తేజాన్నిచ్చేలా కనిపిస్తుంది.