Liquor Consumption Oath: బిహార్‌లో మద్యపాన నిషేధాన్ని మరింత కఠనంగా అమలు చేయడానికి ఆ రాష్ట్రముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడుంబిగించారు. రాష్ట్ర ప్రజలతో పాటు.. అన్నీ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి జీవితాంతం మద్యపానానికి దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు. మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాక.. సమాజానికి హానికరమని సీఎం అన్నారు. అందుకే ప్రజలందరూ.. ఈ ప్రమాణానికి కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
"మద్యాన్ని సేవించడం చెడ్డది మాత్రమే కాదు.. సమాజానికి అది అత్యంత ప్రమాదకారి కూడా. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హూచ్ సంబంధిత మరణాలు ప్రజలకు ఇదే సందేశాన్నిస్తున్నాయి. అందుకే అందరూ లిక్కర్ తీసుకోకుండా ఉండడానికి కట్టుబడి ఉండాలి."
- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి