తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బలగాల రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమే' - 2019 వైమానిక దాడులపై ఏకే ఆంటోనీ మీడియా సమావేశం

సాయుధ బలగాలకు చెందిన రహస్యాలను బహిర్గతం చేయడం దేశ ద్రోహమేనని కాంగ్రెస్​ నేత ఏకే ఆంటోని అన్నారు. 2019 వైమానిక దాడుల కేసులో వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసిన ఆయన.. దోషులను శిక్షించాలన్నారు.

Leaking of official secret of military ops is treason: AK Antony
'సాయుధ బలగాల రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహం'

By

Published : Jan 20, 2021, 3:28 PM IST

Updated : Jan 20, 2021, 5:14 PM IST

సైనిక బలగాలకు సంబంధించిన అధికారిక రహస్యాలను బహిర్గతం చేయడం దేశ ద్రోహం కిందకు వస్తుందని కాంగ్రెస్​ నేత ఏకే ఆంటోని అన్నారు. ఇందులో చేతులు కలిపినవారికి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. ఈ మేరకు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామికి చేసిన వాట్సాప్ చాట్లను గురించి కూడా ప్రస్తావించారు. 2019 వైమానిక దాడులకు సంబంధించిన సమాచారం లీక్​ అవడంపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు ఆంటోని. జాతీయ భద్రతకు భంగం కలిగించే ఈ అంశంలో దోషులెవరినీ వదిలిపెట్టకూడదన్నారు.

2019 ఫిబ్రవరి 26న భారత్​కు చెందిన మిరాజ్​ యుద్ధ విమానాలు పాకిస్థాన్​లోని బాలాకోట్​లో జైషే మహ్మద్​ ఉగ్రస్థావరంపై దాడి చేసి.. దాయాది దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీచేశాయి.

ఇదీ చదవండి:'ఆ ఛానల్​ రేటింగ్​ పెంచేందుకు కుట్ర!'

Last Updated : Jan 20, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details