Helicopter Ride to see Jallikattu: అక్కడ ఆసక్తికరంగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. యువకులు ఎద్దులతో ఉత్సాహంగా తలపడుతున్నారు. అప్పుడే పెద్దశబ్దం చేసుకుంటూ వచ్చి హెలికాప్టర్ ల్యాండయింది. క్షణాల్లో అంతా అక్కడ వాలిపోయారు. అక్కడ దిగింది బిజినెస్మెన్ బాబు మరి.
ఐదో తరగతి వరకే చదివిన బాబు.. పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. రూ. 10 వేల కోట్ల విలువైన అటికా జువెలరీ కంపెనీకి ఆయనే యజమాని. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయన సంస్థకు బ్రాంచ్లు ఉన్నాయి.
ధర్మపురి జిల్లా తడంగం పంచాయతీ పరిధిలో బుధవారం జల్లికట్టు పోటీలు నిర్వహించారు. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు బాబు.. బెంగళూరు నుంచి కుటుంబసమేతంగా హెలికాప్టర్లో విచ్చేశారు. స్థానికులు ఆయనకు పూలమాలలు వేసి.. కరతాళ ధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.