సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి, ఆ డబ్బుతో అందరికీ కరోనా టీకాలను ఉచితంగా ఇవ్వాలని 12 విపక్ష పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.6000, ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వాలని కోరారు. దాంతో పాటు వ్యవసాయ చట్టాల్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.
ఉచిత టీకా కోసం మోదీకి విపక్ష నేతల లేఖ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేసి, అందరికీ ఉచితంగా కరోనా టీకాలను పంపిణీ చేయాలని 12 విపక్ష పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల్నీ రద్దు చేయాలని కోరారు. ఈమేరకు ఓ లేఖ రాశారు.
కరోనా
లేఖ రాసిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు.
Last Updated : May 12, 2021, 7:38 PM IST