తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన నేతలు - సంజయ్ రౌత్ ట్వీట్

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపు ఖాయమైన నేపథ్యంలో దేశంలోని పలు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మమత బెనర్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

mamata bannerjee
మమత బెనర్జీ

By

Published : May 2, 2021, 3:50 PM IST

బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్​ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శుభాకాంక్షలు చెప్పారు పలు పార్టీలకు చెందిన నేతలు.

"గెలుపు దిశలో ఉన్న మమతా బెనర్జీకి శుభాకాంక్షలు. ప్రజల సంక్షేమం కోసం, కొవిడ్​ కట్టడి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం."

--శరద్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడు

టీఎంసీదే విజయం..

మమతా బెనర్జీ బంగాల్​లో మళ్లీ అధికారంలో వస్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కానీ, ఈ సంఖ్య కన్నా కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం బాధకలిగిస్తోందని వ్యాఖ్యానించారు. భాజపా విసిరిన సవాల్​ను స్వీకరించిన దీదీ.. ఒకే స్థానంలో పోటీ చేయడం ప్రశంసించాల్సిన విషయమని రౌత్ అన్నారు. భాజపా ఎంత కృషి చేసినప్పటికీ మమతను ఓడించడం అంత సులభం కాదని పేర్కొన్నారు.

స్టాలిన్​, దీదీకి శుభాకాంక్షలు

ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన అధిక్యం కనబరుస్తోన్న బంగాల్​లోని టీఎంసీ పార్టీకి, తమిళనాడులోని డీఎంకే పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. మమత బెనర్జీ, ఎంకే స్టాలిన్​కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

"మమతా బెనర్జీకి శుభాకాంక్షలు. ఇది గొప్ప విజయం. బంగాల్​ ప్రజలకు శుభాకాంక్షలు."

--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.

"విజయం దిశగా వెళ్తున్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​కు శుభాకాంక్షలు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా స్టాలిన్ పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నా."

--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.

ద్వేషపూరిత రాజకీయాలకు ఓటమి..

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్.. బంగాల్​లో ద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు ఓడించారని అన్నారు. భాజపాకు ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు.

పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా మఫ్తీ.. టీఎంసీ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థ రాజకీయాలను తిరస్కరించినందుకు బంగాల్​ ప్రజలకు అభినందనలు అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:అజేయుడు ఊమెన్ చాందీ.. 12వ సారి విజయం

ABOUT THE AUTHOR

...view details