కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. శబరిమల విషయంలో భక్తుల మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దీనిపై ప్రతిపక్ష యూడీఎఫ్ మౌనం వహిస్తోందని ఆక్షేపించారు. కొల్లాం జిల్లా కరునంగపల్లిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా... పినరయి విజయన్ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయ్యప్ప దేవాలయ ఆచారాలను కాపాడటానికి భాజపా విశ్వప్రయత్నాలు చేసిందని నడ్డా పేర్కొన్నారు. శబరిమల ప్రతిష్ఠను కాపాడేందుకు పాటుపడిన భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్‌లు జరిపారని అన్నారు. భక్తులపై కేసులు కూడా నమోదు చేయించారని అధికార ఎల్డీఎఫ్ కూటమిపై మండిపడ్డారు.