దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు బాసటగా నిలిచే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఈ జాబితాలో తాజాగా న్యాయవాదులు చేరారు. రైతులకు మద్దతుగా 141 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు.
దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సూమోటోగా ఈ అంశంపై విచారణ జరిపించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేలా హోంశాఖకు ఆదేశాలివ్వాలని న్యాయవాదులు సీజేఐని కోరారు.