Lawyer locked his wife in Dark room 11years: ఆయన ఓ న్యాయవాది.. పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న అతడు ఆ వృత్తికే కళంకం తెచ్చే పని చేశాడు. తన తల్లి, సోదరుడి మాటలు వినీ.. తాళి కట్టిన భార్యను ఏకంగా 11 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించాడు. ఆమెను బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 సంవత్సరాల పాటు కఠినమైన జీవితాన్ని అనుభవించింది ఆ మహిళ. తన న్యాయవాద వృత్తిని అడ్డం పెట్టుకొని బయట ప్రపంచానికి, తల్లిదండ్రులకు దూరం చేసిన ప్రబుద్ధుడు గోదావరి మధుసూదన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు తన భార్యను చీకటి గదిలో ఉంచడానికి కారణం ఎంటో తెలుసుకుంటే ఆశ్చర్య కరమైన నిజాలు బయట పడ్డాయి.
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకి, విజయనగరంలోని కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ తో 2008లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మధుసూదన్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అయితే తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి, తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను చీకటి గదిలో 11 సంవత్సరాలు పాటు బంధించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అడిగిన తన న్యాయవాది వృత్తిని అడ్డం పెట్టుకొని బాధితురాలు కుటుంబ సభ్యులను బెదిరించేవాడు.