Chennai Lawyer Fine: కరోనా సమయంలో కోర్టులు ప్రత్యక్ష విచారణను తాత్కాలికంగా నిలిపివేసి ఆన్లైన్ వేదికగా కేసుల వాదనలు విన్నాయి. చెన్నై హైకోర్టు ఓ కేసును వర్చువల్‌గా విచారించినప్పుడు సంతాన క్రిష్ణన్ అనే న్యాయవాది తనతో పాటు ఉన్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తన ముందు కెమెరా ఆన్ చేసి ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి రెచ్చిపోయాడు. ఈ వీడియోను ఈ కేసులో హాజరైన మరో వ్యక్తి మొబైల్లో రికార్డు చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయింది. దీంతో చెన్నై హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన చెన్నై హైకోర్టు సీబీసీఐడీతో విచారణ జరపాలని ఆదేశించింది.
ఆన్లైన్ విచారణలో రాసలీలలు.. లాయర్‌కు రూ.4లక్షలు ఫైన్ - Chennai Lawyer viral video
Chennai Lawyer viral Video: వర్చువల్ హియరింగ్‌లో కెమెరా ఆన్ చేసి ఉందనే విషయం మర్చిపోయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన లాయర్‌కు రూ.4లక్షలు జరిమానా విధించింది చెన్నై హైకోర్టు. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేసింది.
కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి లాయర్ సంతాన క్రిష్ణన్‌ను అరెస్టు చేశారు. వాదనలు విన్న జస్టిస్ పీఎన్ ప్రకాశ్ నేతృత్వంలోని ధర్మాసనం.. లాయర్‌ను రూ.4లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని చెప్పింది. దీంతో ఏప్రిల్ 6న లాయర్ సంతాన క్రిష్ణన్ రూ.4లక్షలను బాధితురాలికి పరిహారంగా ఇచ్చారు. అనంతరం జడ్జి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణపై ఎలాంటి తేదీలను ప్రస్తావించలేదు.
ఇదీ చదవండి:యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్!