తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lawmakers Immunity : చట్టసభ సభ్యులు అవినీతికి పాల్పడితే విచారణ నుంచి రక్షణ! - చట్టసభల్లో అవినీతికి పాల్పడే కేసు సుప్రీంకోర్టు

Lawmakers Immunity : పార్లమెంటు, శాసనసభల సభ్యులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారికి రక్షణ కొనసాగించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని దాఖలైన కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

Lawmakers Immunity
Lawmakers Immunity

By PTI

Published : Oct 4, 2023, 9:14 PM IST

Lawmakers Immunity :చట్టసభల సభ్యుల చర్యలు నేరపూరితమైనప్పటికీ.. వారికి రక్షణ కొనసాగించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నప్పుడు విచారణ నుంచి వారికి రక్షణ కల్పిస్తూ.. 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని దాఖలైన కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 1998 సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన ధర్మాసనం.. నేరపూరిత చర్యతో సంబంధం లేకుండా చట్టసభల సభ్యులకు రక్షణ లభిస్తున్నట్లు పేర్కొంది. రక్షణ అంశాన్ని పరిశీలించాల్సి ఉందని జస్టిస్‌ AS బోప్పన్న, జస్టిస్‌ MM సుందరేశ్‌, జస్టిస్‌ PS నర్సింహా, జస్టిస్‌ JB పార్దీవాలా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

యావత్‌ దేశాన్ని కుదిపేసిన JMM ముడుపుల కేసులో 25ఏళ్ల తర్వాత 1998నాటి తీర్పును పున:పరిశీలించేందుకు గతనెల 20న అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఇది రాజకీయ నైతికతకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయమని పేర్కొంది. ఇటీవలె ఆ కేసును పరిశీలించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పి.వి.నరసింహారావు వర్సెస్‌ సీబీఐ కేసులో 1998లో వెలువడిన తీర్పును పునఃపరిశీలిస్తామని తెలిపింది. రాజకీయ నైతికతపై ప్రభావం చూపే ఈ అంశం ముఖ్యమైనదేనని అభిప్రాయపడుతూ ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

JMM Bribery Supreme Court Judgement : కొన్నేళ్ల క్రితం జరిగిన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్‌ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? వారికి రక్షణ ఉంటుందా? అనే అంశాన్ని 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసుకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.

Ram Setu Supreme Court : 'రామసేతు' వద్ద గోడ కట్టాలంటూ పిల్​.. నో చెప్పిన సుప్రీం

Mps and Mlas Corruption Supreme Court : చట్టసభల్లో అవినీతికి పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు!.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details