కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యంతో (Kiren Rijiju dance) అలరించారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బుధవారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి 'సాజొలాంగ్' ప్రజలు ఆయనకు జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.
ఈ క్రమంలో ఆయన సైతం లయబద్ధంగా నృత్యం (Kiren Rijiju dance) చేశారు. సంప్రదాయ వాయిద్యాలు, గ్రామస్థుల చప్పట్లు, కేరింతల నడుమ ఉల్లాసంగా అడుగులు కదిపారు. అనంతరం ఈ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
"వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లా. ఎవరైనా అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల ఆనందం ఇది. ఇక్కడి జానపద పాటలు, నృత్యాలు.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి" అని ట్వీట్ చేశారు.