కేరళలోని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లతికా సుభాశ్.. పార్టీ కార్యాలయం ఎదుట శిరోముండనం చేయించుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న లతికా.. ఎట్టుమనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. దీంతో శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపిన ఆమె.. పార్టీ మహిళా విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
సీటు దక్కలేదని మహిళా సెల్ అధ్యక్షురాలు శిరోముండనం - Latika Subhash resigns as state president of Mahila Congress
సీట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని కేరళ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లతికా సుభాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట గుండు కొట్టించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
మహిళలకు సీట్లు కేటాయించలేదని శిరోముండనం
పార్టీకి ఎంతో చేసినా.. సీటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు లతికా సుభాశ్. లతికా సుభాశ్తో పాటు పలువురు మహిళా నేతలు వారి పదవులకు రాజీనామా చేశారు.