తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాళ్లింతవరకు నెట్ వాడలేదు.. తెలుసా? - latest National Family health survey

కేంద్రం చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మారుతోన్న కంప్యూటర్​ కాలంలో కూడా దేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజల్లో ఇప్పటికీ ఇంటర్​నెట్​ వాడడం తెలియదని తేలింది.

latest National Family Health Survey has revealed some facts about literacy net usage
వాళ్లింతవరకు నెట్ వాడలేదు..తెలుసా?

By

Published : Dec 16, 2020, 7:46 AM IST

ఇంటర్నెట్ లేకుండా నిమిషం గడవని ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఏ మాత్రం అంతరాయం కలిగినా..చాలా మిస్‌ అయినట్లు కంగారుపడిపోతాం. కానీ, 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 60 శాతం మందికి పైగా మహిళలు ఇంతవరకు నెట్ వాడలేదని తెలుసా? 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(2019-20)లో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. 6.1 లక్షల ఇళ్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను సిద్ధం చేశారు.

40 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఇంటర్నెట్‌ వాడుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌(21శాతం), అసోం(28.2 శాతం), బిహార్(20.6శాతం), గుజరాత్(30.8శాతం), కర్ణాటక(35శాతం), మహారాష్ట్ర(38శాతం), మేఘాలయ(34.7శాతం), తెలంగాణ(26.5శాతం), త్రిపుర(22.9శాతం), పశ్చిమ బెంగాల్‌(25.5శాతం), దాద్రా నగర్‌ హవేలీ, దామన్, దయ్యు(36.7శాతం), అండమాన్‌ నికోబార్(34.8శాతం) ఉన్నాయి. అలాగే స్త్రీలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అండమాన్ వంటి ఏడు రాష్ట్రాల్లో సుమారు 50శాతం మంది పరుషులు నెట్‌ వినియోగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, బిహర్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండగా..కేరళ, లక్షద్వీప్, మిజోరం వంటి రాష్ట్రాల్లో మాత్రం ఆ శాతం ఎక్కువగా ఉందని సర్వే గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. అలాగే పురుషుల అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్ వంటి రాష్ట్రాలు వెనుకంజలో ఉండగా..కేరళ, లక్షద్వీప్ మాత్రం ముందున్నాయి. తొమ్మిదో తరగతి లేక అంతకంటే ఎక్కువ చదివి, ఒక వాక్యం లేక ఒక వాక్యంలోని కొంత భాగాన్ని చదవగలగడమే అక్షరాస్యత కిందికి వస్తుందని ఈ సర్వే తెలిపింది.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై రైతు పోరాటం మరింత ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details