దేశంలో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 16,738 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 138మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,10,46,914
- మరణాలు: 1,56,705
- రికవరీల సంఖ్య: 1,07,38,501
- యాక్టివ్ కేసులు: 1,51,708
కొవిడ్ బారినపడిన వారిలో 11,799 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.21 శాతానికి చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.