తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Last Rites of CDS: యుద్ధవీరుడు రావత్​కు కన్నీటి వీడ్కోలు - దిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు

Last Rites of CDS
సీడీఎస్ రావత్ అంత్యక్రియలు

By

Published : Dec 10, 2021, 9:28 AM IST

Updated : Dec 10, 2021, 5:00 PM IST

16:41 December 10

రావత్​ దంపతులకు తుది వీడ్కోలు..

దేశ రక్షణ కోసం జీవితాన్ని అర్పించి, సైన్యంలో సుదీర్ఘ సేవలందించిన భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​కు ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. దిల్లీలోని బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. బిపిన్​ రావత్​, మధులికా రావత్​ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం జరిగాయి. రావత్​కు గౌరవసూచికగా.. 17 తుపాకులతో వందనం చేసింది సైన్యం. కుటుంబసభ్యులు, దాదాపు 800మంది మిలిటరీ సిబ్బంది.. రావత్​ దంపతులకు తుది వీడ్కోలు పలికారు.

అంతకుముందు.. శ్మశానవాటికలో రావత్​ దంపతులకు కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​తో పాటు వివిధ దేశాల రక్షణశాఖ అధికారులు నివాళులర్పించారు.

16:30 December 10

రావత్​ దంపతులకు.. కుమార్తెలు కృతిక, తరణితో పాటు కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

16:18 December 10

బార్​ స్క్వేర్​లో బిపిన్​ రావత్​ దంపతులకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ నివాళులర్పించారు.

15:59 December 10

బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. వివిధ దేశాలకు చెందిన రక్షణ అధికారులు.. బిపిన్​ రావత్​ దంపతులకు నివాళులర్పించారు.

15:48 December 10

సీడీఎస్‌ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు

  • బ్రార్ స్క్వేర్‌ శ్మశానవాటికలో రావత్ దంపతుల అంత్యక్రియలు
  • సైనిక లాంఛనాలతో రావత్ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు
  • రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్న 800 మంది సర్వీస్ సిబ్బంది
  • అంత్యక్రియల సమయంలో రావత్‌కు 17 తుపాకులతో వందనం
  • గౌరవసూచికగా 17 తుపాకులతో వందనం చేయనున్న సిబ్బంది
  • 17 తుపాకులతో వందనం తర్వాత బిపిన్ రావత్‌కు తుది వీడ్కోలు

14:40 December 10

దిల్లీలో సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ అంతిమయాత్ర సాగుతోంది. దారిపొడవున ప్రజలు జెండాలతో వారికి సెల్యూట్​ చేస్తున్నారు.

14:22 December 10

జనరల్​ బిపిన్​ రావత్​ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి బార్​ స్క్వేర్​ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో రావత్​ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి.

14:00 December 10

దేశ త్రివిధ దళాల అధిపతులు.. జనరల్​ నరవణే, ఎయిర్​ చీఫ్​ మార్షెల్​ వీఆర్​ చౌదరి, నేవీ చీఫ్​ అడ్మైరల్​ హరికుమార్​.. బిపిన్​ రావత్​కు నివాళులర్పించారు.

13:41 December 10

సీజేఐ నివాళి

బిపిన్ రావత్ పార్థివ దేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి.రమణ నివాళులు అర్పించారు.

13:26 December 10

కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్​, మన్​సుఖ్ మాండవీవ, స్మృతి ఇరానీ, సర్బానంద సోనోవాల్​.. సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.

13:19 December 10

బిపిన్ రావత్​ దంపతులకు​ భారతీయ కిసాన్​ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ నివాళులు అర్పించారు.

12:54 December 10

17 గన్​ సెల్యూట్​

నిబంధనల ప్రకారం.. సీడీఎస్​ బిపిన్​ రావత్​కు సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. '17 గన్​ సెల్యూట్​'తో జవాన్లు వందనం చేశారు.

11:38 December 10

సీడీఎస్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులిక రావత్​కు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ పుష్పాంజలి ఘటించారు.

11:36 December 10

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీలు బిపిన్​ రావత్​ దంపతులకు నివాళులర్పించారు.

11:19 December 10

రావత్ దంపతులకు వారి కుమార్తెలు కృతిక, తరణి నివాళులు అర్పించారు. తల్లిదండ్రుల భౌతికకాయాలపై పూల రేకులు జల్లి అంతిమ వీడ్కోలు పలికారు.

11:18 December 10

సీడీఎస్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులిక రావత్​కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించారు.

11:08 December 10

సీడీఎస్​ రావత్ దంపతులకు దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అనిల్ బైజల్​ నివాళులు అర్పించారు.

11:00 December 10

రావత్​కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడున్న వారు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

10:59 December 10

సీడీఎస్ బిపిన్ రావత్ పార్థీవ దేహానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ సింగ్ రావత్ కుడా సీడీఎస్​​కు నివాళులు అర్పించారు.

10:30 December 10

బిపిన్ రావత్​ దంపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ఇద్దరి భౌతికకాయాలకు పుష్పాంజలి ఘటించారు.

10:23 December 10

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులిక రావత్​ల భౌతికకాయాలు దిల్లీలోని వారి నివాసానికి చేరుకున్నాయి. 11 గంటల నుంచి సాధారణ పౌరులను నివాళులు అర్పించేందుకు అనుమతిస్తారు.

09:04 December 10

Last Rites of CDS: రావత్ దంపతులకు ప్రముఖుల నివాళి

Last Rites of CDS: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్​ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ అంత్యక్రియలు దిల్లీలో నేడు సాయంత్రం జరగనున్నాయి.

జనరల్‌ రావత్‌, మధులిక రావత్​ భౌతికకాయాలను ప్రజల సందర్శనార్థం శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 3 కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ నివాసం వద్ద ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు సైనిక సిబ్బంది నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు దిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్‌ రావత్‌ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Cds general helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ బుధవారం దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగాను 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

Last Updated : Dec 10, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details