దేశంలోని చివరి పల్లెకూ కరోనా టీకాలు(Corona vaccine), ఔషధాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మారుమూల గ్రామాలు, రాకపోకలకు కష్టమైన కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వాటిని చేరవేసేందుకు బిడ్లను ఆహ్వానించింది.
డ్రోన్లతో డెలివరీ చేయడానికి ఐఐటీ కాన్పుర్తో కలిసి ఇప్పటికే ప్రమాణిక నిర్వహణ నియమాలను రూపొందించింది భారత వైద్య పరిశోధన మండలి(ICMR). వాటి ప్రకారం డెలివరీ చేసిన అనంతరం డ్రోన్లు తిరిగి కమాండ్ స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది.