Last leg of Operation Ganga: ఉక్రెయిన్ నుంచి ఆదివారం 2,135 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 15,900కు చేరిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. సోమవారం మరో ఎనిమిది విమానాల్లో భారతీయులను తరలించనున్నారు. బుడాపెస్ట్ నుంచి 5 విమానాలు, సుసెవా నుంచి రెండు విమానాలు బుకారెస్ట్ నుంచి ఒక విమానంతో 1500 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు.
మరోవైపు, ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. వారంతా అత్యవసర ప్రాతిపాదికన గూగుల్ ఫారాన్ని నింపాలని సూచించింది. పేరు, ఫోన్ నంబర్, ప్రస్తుతం తాము ఉంటున్న ప్రాంతం చిరునామా సహా ఫారంలో సూచించిన వివరాలను అందజేయాలని స్పష్టం చేసింది.